భారత్‌లో వెలుగుచూసి, దేశంలో రెండో దశ కరోనా విజృంభణకు కారణమైన B.1.617 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగానూ కల్లోలం రేపుతోందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇప్పటివరకు ఈ వేరియంట్‌ను 44 దేశాల్లో గుర్తించామని వెల్లడించింది. గత ఏడాది అక్టోబరులో మొదటిసారి ఇండియాలో గుర్తించిన ఈ B.1.617 కరోనా వేరియంట్‌ను.. 44 దేశాలు ఓపెన్ యాక్సెస్ డేటా కోసం అప్‌లోడ్ చేసిన 4,500కుపైగా శాంపిళ్లలో కనుగొన్నామని డబ్ల్యూహెచ్‌వో వివరించింది. భారత్‌లోనే కాకుండా.. ఈ వేరియంట్ బ్రిటన్‌లోనూ భారీగా పాజిటివ్ కేసులకు కారణమైందని వెలిపింది. ఇదిలా ఉంటే.. B.1.617 వేరియంట్ అధికారికంగా ఇటీవలే డబ్ల్యూహెచ్‌వో ధ్రువీకరించింది. ఇటు ఇప్పటికే బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో వేర్వేరు కొత్త వేరియంట్లను డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. భారత్‌లో వెలుగుచూసిన B.1.617 రకాన్ని కొత్త వేరియంట్ల జాబితాలో చేర్చినట్టు వెల్లడించింది. తొలినాళ్లలో సంక్రమించిన కరోనా వైరస్ కంటే.. ఈ వేరియంట్ చాలా ప్రమాదకరమైనదని.. దాని కంటే వేగంగా విస్తరించడమేగాక.. అధిక తీవ్రతతో విరుచుకుడుతోందని తెలిపింది. భారత్‌లో రికార్డుస్థాయిలో వెలుగుచూస్తున్న కేసులు, మరణాలకు ఇదే కారణమని చెప్పుకొచ్చింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement