Sunday, November 24, 2024

మరోసారి దాయాదుల పోరుకు సిద్దంకండి..

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే చాలు ఆ ఉత్కంఠయే వేరుగ ఉంటుంది. ఇరు దేశాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. గ్రౌండ్ ఆటగాళ్లు తలపడ్డారంటే చాలు అభిమానులు నరాలు తెగే ఉత్కంఠ మొదలవుతుంది. అదే టీమిండియా- పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం..ఓ ప్రపంచ యుధ్దంలా ఉంటుంది. అలాంటి మ్యాచ్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఈ దాయాదులు ఒకే గ్రూప్‌లో ఉన్నారు. ఐసీసీ శుక్ర‌వారం గ్రూపుల‌ను ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14 మ‌ధ్య యూఏఈలో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ర‌గ‌నున్న విషయం తెలిసిందే. సూప‌ర్ 12లో ఇండియా గ్రూప్ 2లో ఉన్నాయి..వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో రెండు రౌండ్లుగా మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. తొలి రౌండ్‌లో గ్రూప్ ఎ, గ్రూప్ బిలోని 8 టీమ్స్ పాల్గొంటాయి. ఇందులో నుంచి నాలుగు టీమ్స్ ప్ర‌ధాన రౌండ్‌కు అర్హత సాధిస్తాయ‌ని ఐసీసీ వెల్ల‌డించింది. నిజానికి ఇండియాలో జ‌ర‌గాల్సిన ఈ టోర్న‌మెంట్ క‌రోనా కార‌ణంగా యూఈఏకి త‌ర‌లించారు. అయితే టోర్నీ హోస్ట్‌గా ఇండియానే ఉంటుంది.

గ్రూప్ 1: వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, గ్రూప్ ఎ విజేత‌, గ్రూప్ బి ర‌న్న‌ర‌ప్‌
గ్రూప్ 2: ఇండియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌, గ్రూప్ ఎ ర‌న్న‌ర‌ప్‌, గ్రూప్ బి విజేత‌
గ్రూప్ ఎ: శ్రీలంక‌, ఐర్లాండ్‌, నెద‌ర్లాండ్స్‌, నమీబియా
గ్రూప్ బి: బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌, ప‌పువా న్యూగినియా, ఒమ‌న్

Advertisement

తాజా వార్తలు

Advertisement