Tuesday, November 26, 2024

రక్షణ రంగంలో ఇండియా టాప్.. జేఎన్‌టీయూ వజ్రోత్సవాల్లో డీఆర్డీవో చైర్మన్‌ సతీష్‌రెడ్డి..

అనంతపురం, ప్రభన్యూస్‌ బ్యూరో: రక్షణ రంగంలో అగ్రగామిగా భారత్‌ వెలుగొందుతోందని డీఆర్‌డీవో చైర్మన్‌ సతీష్‌ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పా-టై 75ఏళ్లు పూర్తైన సందర్భంగా వజ్రోత్స వాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో జేఎన్టీయూ పూర్వ విద్యార్థి, డీఆర్‌డీవో చైర్మన్‌ సతీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, వీసీ రంగా జనార్ధన్‌ తో కలసి ఫైలాన్‌ ను, వసతిగృహాల, శిలాఫలకాలు ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో జరిగిన సమావేశం లో సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ అనంతపురం జేఎన్టీయూలో చదువు కున్న వారు అత్యంత ప్రావీణ్యం కలిగి ఉంటారని.. ఈ కళాశాలతో వారికి ఒక అనుభం ఉంటుందని… అది చివరి శ్వాస వరకు కొనసాగుతుందన్నారు. దేశంలో డీఆర్‌డీవో చేస్తున్న ప్రయోగాలు ప్రపంచ అగ్ర దేశాలు సరసన నిలుపుతున్నాయన్నారు. ప్రపంచం లోనే అత్యాధునిక గన్‌ ను తయారు చేసిన ఘనత డీఆర్‌డీ వోకే దక్కుతుందన్నారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే యాంటీ శాటిలైట్‌ మిషన్‌ను తయారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

జేఎన్టీయూలో ఇంక్యూబెషన్‌ సెంటర్‌ ఏర్పా టు-కు ఒప్పందం కుదుర్చుకున్నట్లు- తెలిపారు. విద్యార్థులు ప్రయోగాల వైపు అడుగులు వేయాలని సతీష్‌ రెడ్డి పిలుపు నిచ్చారు. విద్యార్థులు పరిశోధన రంగం వైపు అడుగులు వేయాలన్నారు. నిరంతరం అధ్య యనం పరిశోధన ద్వారా ఉన్నత రంగం సాధించ వచ్చు అన్నారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్యా రంగంలో సంస్కరణల గురించి వివరించారు. ఉన్నత విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రంగ జనార్దన్‌ మాట్లాడుతూ కళాశాల వజ్రోత్సవాలకు హాజరైన పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ కే యు వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రామకృష్ణారెడ్డి, రాయలసీమ యూని వర్సిటీ- వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ ఆనందరావు, సెంట్రల్‌ యూనివర్సిటీ- వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ కోరి ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement