వచ్చే నెల దేశంలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్ గా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల ఓ సర్వేలో ఉత్తర్ ప్రదేశ్ లో మళ్లీ బీజేపే అధికారంలోకి వస్తుందని అంచానా వేసింది. ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే మళ్లీ బిజెపి కూటమి ఎన్డీయే అధికారం చేజిక్కించుకుంటుందని ఇండియా టుడే సర్వేలో తెలిపింది. ఈ మేరకు మూడ్ ఆఫ్ దినేషన్ సర్వేలో వెల్లడయింది. కాగా 543స్థానాలు ఉన్న లోక్ సభలో ఎన్డీయేకు 296, యూపీఏకు 127, ఇతరులకు 120 స్థానాలు దక్కుతాయని అంచానా వేసింది. ఇందులో ఒక్క బీజేపీకే 271 స్థానాలు దక్కితే… కాంగ్రెస్ పార్టీకి 62, మిగతా పార్టీలకు 210 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..