ప్రబన్యూస్ : అరబ్ స్టేట్స్‌కు ఆహార ఎగుమతుల్లో భారతదేశం 15 సంవత్సరాలలో మొదటిసారి బ్రెజిల్‌ను అధిగమించింది. 2020లో కోవిడ్-19 మహమ్మారి అంతరాయం వల్ల వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలిగింది. అరబ్-బ్రెజిల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్.. రాయిటర్స్‌కు (జర్నలిస్ట్ సంస్థ) అందించిన డేటా ప్రకారం, భారతదేశం 15 సంవత్సరాలలో మొదటిసారి బ్రెజిల్‌ను ఆహార ఎగుమతుల్లో అధిగమించినట్లు తెలుస్తుంది.
బ్రెజిల్ అత్యంత ముఖ్యమైన కమర్షియల్ భాగస్వాములలో అరబ్ ఒకటి. కాగా.. గత సంవత్సరం 22 లీగ్ సభ్యులు దిగుమతి చేసుకున్న మొత్తం అగ్రిబిజినెస్ ఉత్పత్తులలో బ్రెజిల్ 8.15% వాటాను కలిగి ఉంటే, భారతదేశం ఆ వాణిజ్యంలో 8.25% స్వాధీనం చేసుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital