భారత్ అమ్ముల పొదిలో మరో అద్భుదమైన అస్త్రం చేరింది. 5వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న టార్గెట్‌ని అయినా కచ్చితంగా కొట్టేయగల అణు సామర్థ్యం గల మిస్సైల్ (అగ్ని వి)ని ఇండియా ఇవ్వాల ప్రయోగించింది. గురువారం రాత్రి జరిపిని ఈ పరీక్ష సక్సెస్ అయినట్టు భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి. అయితే.. అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని వి బాలిస్టిక్ క్షిపణిని మరింత శక్తివంతంగా తయారు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
అయితే.. ఇది మునుపటి కంటే ఇప్పుడు తేలికైన క్షిపణిలో కొత్త టెక్నాలజీని యాడ్ చేసినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. అవసరమైతే అగ్ని V క్షిపణి పరిధిని పెంచే సామర్థ్యాన్ని ఈ ట్రయల్ నిరూపించిందని రక్షణ వర్గాలుతెలిపాయి.