ఒడిశా తీరంలో ‘అగ్ని ప్రైమ్’ లేటెస్ట్ బాలిస్టిక్ మిస్సైల్‌ని భారత్ ఇవ్వాల (శుక్రవారం) విజయవంతంగా ప్రయోగించింది. టెస్ట్ ఫ్లైట్ సమయంలో క్షిపణి తన గరిష్ట పరిధిని దాటి ప్రయాణించిందని. అన్ని లక్ష్యాలను ఈజీగా చేరుకుందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అగ్ని ప్రైమ్ క్షిపణికి సంబంధించి వరుసగా మూడో ప్రయోగం కూడా విజయవంతమైనట్టు వెల్లడించారు. ఈసారి జరిపిన ఫ్లైట్ టెస్ట్‌తో టార్గెట్‌ని ఛేదించే వ్యవస్థ యొక్క కచ్చితత్వం, విశ్వసనీయత మెరుగైందన్నారు.
రాడార్, టెలిమెట్రీ.. ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి అనేక రేంజ్ ఇన్‌స్ట్రుమెంటేషన్స్ ద్వారా పొందిన డేటాను ఉపయోగించి సిస్టమ్ పనితీరు ధ్రువీకరించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం పథాన్ని కవర్ చేయడానికి టెర్మినల్ పాయింట్ వద్ద రెండు డౌన్ రేంజ్ షిప్‌లతో సహా వివిధ ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. APJ అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఉదయం 9:45 గంటలకు మొబైల్ లాంచర్ నుండి సొగసైన ఈ బాలిస్టిక్ మిస్సైల్‌ని టెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.
ఘన-ఇంధన డబ్బాతో కూడిన క్షిపణి పరీక్ష సమయంలో అన్ని మిషన్ పారామీటర్‌లను మీట్ అయినట్టు అధికారలు తెలిపారు. దాని నావిగేషన్ అంతా రాడార్లు, వివిధ పాయింట్ల వెంట ఉంచబడిన టెలిమెట్రీ పరికరాల ద్వారా ట్రాక్ చేసినట్టు చెప్పారు. అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణుల కొత్త తరం అధునాతన శ్రేణి, దాని స్ట్రోక్ పరిధి 1,000 కి.మీ నుంచి 2,000 కి.మీ మధ్య ఉంటుందని వారు చెప్పారు. గత ఏడాది డిసెంబర్ 18న ఇదే ప్రయోగ కేంద్రం నుంచి చివరిసారిగా క్షిపణి ప్రయోగం నిర్వహించగా, అది కూడా విజయవంతమైంది.