Tuesday, November 19, 2024

Breaking: బ్రహ్మోస్ ప్రయోగం సక్సెస్.. INS విశాఖ నుంచే టెస్ట్..

సౌండ్ కన్నా మూడు రెట్ల వేగంతో దూసుకుపోయే సూపర్ సోనిక్ బ్రహ్మోస్ మిస్సైల్ ఇండియాకి ప్రత్యేకత అని చెప్పవచ్చు.  బ్రహ్మోస్ మిస్సైల్ ని జలాంతర్గాములు, నౌకలు, విమానాలు లేదా ల్యాండ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కూడా ప్రయోగించవచ్చు.

INS విశాఖపట్నం నుంచి ఈ రోజు ప్రయోగించిన మిస్సైల్ డిస్ర్టాయర్ బ్రహ్మోస్  సూపర్ సక్సెస్ అయ్యింది. భారత నౌకాదళానికి చెందిన స్టెల్త్ గైడెడ్ -మిసైల్ డిస్ట్రాయర్ నుంచి లేటెస్ట్ సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి చెందిన నావికా వైవిధ్యాన్ని ఇండియా మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని “కచ్చితంగా” ఛేదించిందని తెలిపింది.

“సముద్రం నుండి సముద్రానికి చెందిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి నిర్దేశించిన లక్ష్య నౌకను కచ్చితంగా ఢీకొంది” అని DRDO ట్వీట్ చేసింది. క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడంతో భారత నావికాదళం మరింత పటిష్టమైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా మెసేజ్ పంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement