Friday, November 22, 2024

దేశంలో కరోనా కల్లోలం.. 3 లక్షలకు చేరువైన కేసులు

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజూవారీ కరోనా కేసులు మూడు లక్షలకు చేరువ అవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,82,970 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 44,889 ఎక్కువ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. కరోనాతో 441 మంది మృతి చెందారు. అదే సమయంలో 1,88,157 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,55,83,039కి చేరింది.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,87,202 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 18,31,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 15.13 శాతంగా నమోదయ్యాయి.
మరోవైపు దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 8,961కు చేరింది. నిన్నటితో పోలిస్తే 0.79 శాతం కేసులు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement