భారత్ లో కరోనా మహమ్మారి కేసులు విజృంభిస్తున్నాయి. రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదు అవుతున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ మొదలైంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,41,986 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,53,68,312 కు చేరింది. గడచిని 24 గంటల్లో 285 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 4,83,178 కి చేరింది.
దేశవ్యాప్తంగా 40,895 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం రికవరీల సంఖ్య 3,44,12,740 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,72,169 యా క్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది. కాగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 150.06 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..