Tuesday, November 26, 2024

COVID-19: భారత్​లో తగ్గిన కరోనా ఉద్ధృతి.. లక్ష దిగువకు చేరిన కేసులు

భారత్​లో కరోనా ఉద్ధృతి భారీగా తగ్గింది. చాలా రోజుల తర్వాత కరోనా కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరుకున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 83,876 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో 895 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,02,874కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో 1,99,054 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 4,06,60,202 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 11,08,938 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉంది. రికవరీ రేటు 96.19 శాతానికి చేరింది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,69,63,80,755 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement