దేశంలో ఓవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటే.. మరోవైపు కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 7,350 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 202 మంది కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 7,973 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 91,456 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ఎంత తక్కువగా నమోదు కావడం 561 రోజుల తర్వాత ఇదే మొదటిసారి.
ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,75,636 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 3,41,30, 768 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 133,17,84,462 మందికి కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.