దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ.. కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గడం ఊరట కలిగింది. రోజువారీ కేసుల సంఖ్య 558 కనిష్ఠానికి చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,822 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 220 మంది మృతి చెందారు. అదే సమయంలో 10,004 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
దేశంలో 95,014కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,73,757 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 3,46,48,383కి చేరింది. ఇందులో 3,40,79,612 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 1,28,76,10,590 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.