భారత్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటే.. కోవిడ్ పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా తగ్గుతున్నాయి. గత కొంత కాలంగా దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య 10 వేల కన్నా దిగువనే నమోదు అవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 5326 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 453 మంది కోవిడ్ కారణంగా మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,78,007కి చేరింది.
గడిచిన 24 గంటల్లో 8,043 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 79,097 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,47,52,164కి చేరింది. ఇందులో 3,41,95,060 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో 138,34,78.181 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.