దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తున్న వేళ.. కరోనా కేసులు స్వల్పగా తగ్గాయి. దేశంలో కరోనా కేసులు రోజుకు 10 వేల లోపే నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 24 గంటల్లో 8603 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 8,190 మంది కరోనా బారి నుంచి కోలుకోగా.. మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 99,974 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,46,24,360కి చేరింది. ఇందులో 3,40,53,856 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 4,70,530 మంది వైరస్ కు బలైయ్యారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,26,53,44,975కు చేరింది. శుక్రవారం 73,63,706 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.