దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య.. గత వారం రోజులతో పోలిస్తే భారీగా పెరిగింది. దేశంలో కొత్తగా 37,593 మంది వైరస్ బారిన పడగా.. 648 మంది మరణించారు. అదే సమయంలో 34,169 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం దేశంలో 3,22,327 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,25,12,366లకు చేరింది. ఇందులో 3,17,54,281 వైరస్ నుంచి కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 4,35,758 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఒక్కరోజే 61,90,930 కొవిడ్ టీకా డోసులు అందించారు. ఇప్పటివరకు 59,55,04,593 టీకా డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండిః కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు బెయిల్