దేశంలో రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండోరోజు కొవిడ్ కేసుల్లో తగ్గుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 35,499 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 447 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 39,686 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,11,39,457కి చేరింది. రికవరీ రేటు 97.4 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 4,02,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు దేశంలో 4,28,309 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో మాత్రం కరోనా ఉదృతి కొనసాగుతోంది. కేరళలో ఒక్కరోజే 18,067 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి 93 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కొత్తగా 5,508 కరోనా కేసులు నమోదు కాగా.. 151 మంది మరణించారు. కర్ణాటకలో 1,598 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. 20 మంది చనిపోయారు.
మరోవైపు దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 16,11,590 డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు 50 కోట్ల 86 లక్షల 64 వేల 759 వ్యాక్సిన్లు వేశారు.
ఇది కూడా చదవండి: ప్రెగ్నెంట్ అవ్వాలి నాభర్తని పంపించండి అని కోర్టుకెక్కిన మహిళ