దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్నారు. లక్షల్లో నమోదవుతున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వరుసగా మూడో రోజు కూడా 3 లక్షలకు పైగానే కొత్త కేసులు నమోదయ్యాయి.. కానీ, నిన్నటి తో పోలిస్తే.. ఇవాళ 9,550 కేసులు తగ్గిపోయినా.. భారీగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో నిన్న 3,37,704 కరోనా కేసులు నమోదయ్యాయి.
మొన్నటి కంటే నిన్న 9,550 కేసులు తక్కువగా నమోదు కాగా, నిన్న కరోనా వల్ల 488 మంది ప్రాణాలు కోల్పోయాని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే కరోనా నుంచి 2,42,676 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 21,13,365 మందికి చికిత్స అందుతోందని పేర్కొంది. డైలీ పాజిటివిటీ రేటు 17.22 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 10,050 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.89 కోట్లను దాటేయగా.. 4,88,884 మంది ఇప్పటి వరకు కోవిడ్‌తో ప్రాణాలు విడిచారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital