దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,948 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 403 మంది మరణించారు. అదే సమయంలో 38,487 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 3,53,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో శనివారం 15,85,681 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 50,60,06,588కు చేరింది. నిన్న 52,23,612 మందికి వ్యాక్సిన్లు అందించగా.. ఇప్పటివరకు మొత్తంగా 58,14,89,377 టీకా డోసులు పంపిణీ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా, దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,24,24,234కు చేరింది.ఇందులో మొత్తం 3,16,36,469 మంది కోలుకున్నారు. దేశంలో కోవిడ్ మహమ్మారికి 4,34,367 మంది బలైయ్యారు. కేరళలో అత్యధికంగా 17,106 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 4,575 కేసులు, తమిళనాడులో 1,652 కేసులు, కర్ణాటకలో 1,350 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 1,217 కేసులు నమోదయ్యాయి. రోజువారీ కొత్త కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాలు 83.68 శాతం ఉన్నాయి.
ఇది కూడా చదవండిః ఆడపిల్లకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తాః నారా లోకేశ్ ప్రతిజ్ఞ