Saturday, November 23, 2024

దేశంలో భారీగా తగ్గిన కరోనా.. కానీ..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న 40 వేల పై చిలుకు కేసులు నమోదు కాగా.. నేడు ఆ సంఖ్య 30 వేలకు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 30,941 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 350 మంది మ‌ర‌ణించారు. కరోనా నుంచి 36,275 మంది కోలుకున్నారు. దేశంలో ప్ర‌స్తుతం 3,70,640 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 4,38,560 మంది క‌రోనాతో చనిపోయారు. కేర‌ళ‌లో కొత్త‌గా 19,622 కేసులు న‌మోదు కాగా, 132 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా, ఆగస్టు 25 నుంచి వరుసగా ఐదు రోజులు 40 వేలకుపైగా కేసులు నమోదవటం గమనార్హం. మళ్లీ ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 97.53గా ఉంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 64.05 కోట్ల‌కు పైగా టీకా డోసుల పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. సోమవారం ఒక్కరోజే 59 లక్షలకుపైగా టీకా డోసులు అందించినట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: కోరలు చాస్తున్న కరోనా… బయటకొచ్చిన మరో కొత్త రకం వేరియంట్

Advertisement

తాజా వార్తలు

Advertisement