దేశంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజువారీ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి కేసుల మూడు వేలకు చేరువయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. దేశంలో కొత్తగా 2927 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,30,65,496కు చేరాయి. ఇందులో 4,25,25,563 మంది బాధితులు కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో 2,252 మంది కోలుకున్నారు. అదే సమయంలో 32 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,23,654కు చేరింది. ప్రస్తుతం దేశంలో 16,279 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. మరణాలు 1.22 శాతంగా ఉన్నాయి. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు 1,88,19,40,971 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.