దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్ కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. అయితే, నిన్నటి కేసులతో పొల్చితే తాజా కేసులు స్వల్పంగా తగ్గాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజాగా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 69,959 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో 277 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం దేశంలో 8,21,446 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,84,213 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,58,75,790కి చేరగా.. ఇందులో 3,45,70,131 మంది కోలుకున్నారు. దేశంలో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 92,07,700 డోసులు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,52,89,70,294కు చేరింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital