దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 16,156 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 733 మంది కోవిడ్ బాధితులు మరణించారు. ఇదే సమయంలో 17,095 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,31,809కు చేరాయి. ఇందులో 3,36,14,434 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,60,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 4,56,386 మంది వైరస్ వల్ల మరణించారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.20 శాతానికి పెరగగా.. యాక్టివ్ కేసుల రేటు 0.47 శాతానికి తగ్గింది. మరోవైపు టీకా పంపిణీ కూడా వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 104 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: తగ్గేదేలే.. బాదుడే.. బాదుడు.. నేటి రేట్లు ఇవీ