దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గడిచిన మూడు రోజులుగా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య లక్ష దాటుతున్నాయి. రోజువారీ కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు అదేస్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 327 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 4,83,790కి చేరింది.
గడిచిన 24 గంటల్లో 40,863 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,44,53,603కి చేరింది. ప్రస్తుతం దేశంలో 5,90,611 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజివిటి రేటు 10.21 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 151.58 కోట్ల కరోనా కోడోలు అందించినట్లు కేంద్రం పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital