దేశంలో కాలంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,850 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 555 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,36,308 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 274 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.26 శాతానికిపైగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,26,036 కి చేరగా.. మరణాల సంఖ్య 4,63,245 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 111.40 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: తిరుపతి పర్యటనకు ఏపీ సీఎం జగన్
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily