Saturday, November 23, 2024

India Corona: భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు.. 531 రోజుల తర్వాత తొలిసారి

దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. అయితే, మరణాలు సంఖ్య పెరుగుతండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,302 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 267 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,44,99,925 కు చేరింది. ఇందులో 3,39,09,708 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

దేశంలో ప్రస్తుతం 1,24,868 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య ఇంత తక్కువగా నమోదు కావడం 531 రోజుల అనంతరం ఇదే మొదటి సారి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,15,79,69,274 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement