Wednesday, November 20, 2024

India Covid: భారత్ లో కొత్తగా 2528 కరోనా కేసులు

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు భారీగా తగ్గుతున్నాయి. గలంలో లక్షల్లో నమోదు అయిన కేసులు.. ఇప్పుడు వేలకు వచ్చాయి. గడిచిన కొద్ది రోజులుగా నాలుగు వేలలోపు పాజిటివ్ కేసులే నమోదు అవుతున్నాయి. తాజా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2528 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,04,005కు చేరాయి. ఇందులో 4,24,58,543 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

కరోనాతో కొత్తగా 149 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,16,281 పెరిగింది. ప్రస్తుతం దేశంలో 29,181 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.73 శాతంగా ఉండగా.. రోజువారీ పాటివిటీ రేటు 0.40 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,80,97,94,58 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement