Monday, November 25, 2024

India: పెట్రో బాదుడు.. కేంద్రానికి 1.71లక్షల కోట్ల ఆమ్దాని రాక..

పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీ వసూళ్లు కేంద్ర ప్రభుత్వ ఖజనాకు భారీ ఆదాయాన్ని స‌మ‌కూరుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఎక్సైజ్‌ డ్యూటీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గతేడాది మొదటి అర్ధ‌భాగంతో కంపేర్ చేస్తే.. 33 శాతం, కొవిడ్‌ ముందు నాటితో పోల్చితే 79 శాతం చొప్పున వృద్ధి న‌మోద‌యిన‌ట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. ఆర్థికశాఖలోని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌(సీజీఏ) గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌ – సెప్టెంబర్‌ 2021 మధ్యకాలంలో ఎక్సైజ్‌ డ్యూటీ వసూళ్లు రూ.1.71 లక్షల కోట్లకు పెరిగాయి.

గతేడాది ఇదే కాలంలో ఎక్సైజ్‌ డ్యూటీ వసూళ్లు రూ.1.28 లక్షల కోట్లుగా ఉన్నాయని డేటా స్పష్టం చేసింది. ఎక్సైజ్‌ డ్యూటీ రేట్లను గణనీయంగా పెంచడం ఆదాయ వృద్ధికి దోహదపడింది. కాగా ఏప్రిల్‌ – సెప్టెంబర్‌ 2019లో ఎక్సైజ్‌ డ్యూటీ ఆదాయం రూ.95,930 కోట్లతో 79 శాతం మేర పెరిగా యి. ఆర్థిక సంవత్సరం 2020-21లో ఎక్సైజ్‌ డ్యూటీ ఆదాయం రూ.3.89 లక్షల కోట్లు, 2019-20లో రూ.2 .39 లక్షల కోట్లుగా ఉన్నాయని సీజీఏ డేటా పేర్కొంది.

2017లో జీఎస్టీని ప్రవేశపెట్టాక.. పెట్రోల్‌, డీజెల్‌, ఏటీఎ ఫ్‌, నేచురల్‌ గ్యాస్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని విధించారు. ఈ ఉత్పత్తులు మినహా మిగతా ఉత్పత్తులన్నీ జీఎస్టీ పరిధిలోనే ఉన్నాయి. 2018-19లో ఎక్సైజ్‌ డ్యూ టీ ఆదాయం రూ.2.3 లక్షల కోట్లు కాగా అందులో రూ.35,874 కోట్లను రాష్ట్రాలకే బదిలీ చేసినట్టు సీజీఏ డేటా పేర్కొంది. అంతక్రితం ఏడాది 2017-18లో రూ.2.58 లక్షల కోట్ల ఆదాయంలో రూ.71, 759 కోట్లను రాష్ట్రాలకు ట్రాన్స్‌ఫర్‌ చేసినట్టు స్పష్టం చేసింది.

కాగా గతేడాది రిటైల్‌ ఇంధనంపై ఎక్సైటీ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం గణనీయంగా పెంచింది. పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని రూ.19.98 నుంచి రూ.32.9కి పెంచగా.. డీజెల్‌పై డ్యూటీని రూ.31.80కి పెంచింది. కరోనా కారణంగా అంతర్జాతీ య మార్కెట్లో క్రూడ్‌ ధరలు పడిపోతున్న తరుణంలో ప్రయోజనం పొందేందుకు ఎక్సైజ్‌ డ్యూటీ రేట్లు పెంచింది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధర రికార్డ్‌ గరిష్ఠానికి పెరిగినా ఎక్సైటీ డ్యూ టీ రేట్లు ఏమాత్రం తగ్గించడం లేదు. దీంతో రిటైల్‌ ఇంధన ధరలు ఆకాశానికి చేరాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement