భారత్-పాకిస్థాన్ జట్లు క్రికెట్ ఆడుతున్నాయంటే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ఇక పాకిస్థాన్‌పై మన జట్టు గెలిస్తే మన ఆనందానికి హద్దే ఉండదు. ఇటీవల దాయాది జట్లు కేవలం ఐసీసీ టోర్నమెంట్‌లకే పరిమితం అవుతున్నాయి. ద్వైపాక్షిక సిరీస్ ఆడి దాదాపు పదేళ్లు దాటుతోంది. ఈ ఏడాది భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడే అవకాశం ఉందా? అంటే పాక్ మీడియా అవుననే అంటోంది. ఈ ఏడాది భారత్‌తో టీ 20 సిరీస్‌కు సిద్ధంగా ఉండాలని పాక్ క్రికెట్ బోర్డుకు ఆ దేశ ప్రభుత్వం నుంచి సూచనలు వెళ్లాయట. కాగా 2008లో ఆసియా కప్ కోసం చివరగా టీమిండియా పాక్‌కు వెళ్లగా.. 2012-13లో వన్డే సిరీస్ కోసం భారత్‌కు పాక్ జట్టు చివరిసారి వచ్చింది. అటు ఈ రెండు జట్లు చివరిసారిగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లో పోటీ పడగా ఆ మ్యాచ్‌లో టీమిండియానే ఘన విజయం సాధించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement