Saturday, November 23, 2024

ఇండియా .. పాకిస్థాన్ స‌రిహ‌ద్దులో డెలివ‌రీ .. చిన్నారికి బోర్డ‌ర్ అని నామ‌క‌ర‌ణం .. ఏంటా క‌థ ..

ఇండియా .. పాకిస్థాన్ స‌రిహ‌ద్దులో శిశువుకి జ‌న్మ‌నివ్వ‌డంతో ఆ చిన్నారికి బోర్డ‌ర్ అనే పేరు పెట్టారు ఆ దంప‌తులు. అట్టారి స‌రిహ‌ద్దు వ‌ద్ద గ‌త 71రోజులుగా 98మంది పాకిస్థానీయులు చిక్కుకుపోయారు. పంజాబ్ ప్రావిన్స్ లోని రాజన్‌పూర్ జిల్లాకు చెందిన ఈ దంపతుల పేర్లు నింబుబాయి-బాలమ్ రామ్. భారత్-పాక్ సరిహద్దులో జన్మించింది కాబట్టే చిన్నారికి ‘బోర్డర్’ అని నామకరణం చేశామ‌ని తెలిపారు. గర్భిణి అయిన నింబూబాయికి పురిటి నొప్పులు వచ్చాయి. విషయం తెలిసిన సమీపంలోని పంజాబ్‌ ప్రజలు కొందరు ఆమె డెలివరీకి సాయం చేశారు. చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. లాక్‌డౌన్‌కు ముందు యాత్ర కోసం మొత్తం 98 మంది కలిసి భారత్‌కు వచ్చామని, అయితే, అవసరమైన పత్రాలు తమ వద్ద లేకపోవడంతో తిరిగి స్వదేశానికి చేరుకోవడం కష్టంగా మారిందని బాలమ్ రామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ బృందంలో మొత్తం 47 మంది చిన్నారులు ఉన్నారని, వారిలో ఆరుగురు ఇండియాలోనే జన్మించారన్నారు.

బాలమ్ రామ్‌తో కలిసి ఒకే టెంటులో ఉంటున్న పాకిస్థాన్‌కు చెందిన లగ్యా రామ్ కూడా తన కుమారుడికి ‘భారత్’ అని పేరు పెట్టాడం విశేషం. గతేడాది జోధ్‌పూర్‌లో ఆ బాబు జన్మించాడు. జోధ్‌పూర్‌లో ఉంటున్న తన సోదరుడిని కలిసేందుకు తాను ఇండియా వచ్చి చిక్కుకుపోయినట్టు లగ్యారామ్ వివరించాడు. పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీరంతా ప్రస్తుతం అట్టారి సరిహద్దు వద్ద ఓ టెంట్‌లో నివసిస్తున్నారు. వీరిని దేశంలోకి అనుమతించేందుకు పాకిస్థానీ రేంజర్లు నిరాకరిస్తున్నారు. వీరికి స్థానికులు ప్రతి రోజూ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన మందులు, దుస్తులు సరఫరా చేస్తున్నారు. మ‌రి వీరి బాధ‌లు ఎప్ప‌టికి తొల‌గిపోతాయో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement