ఆఫ్రికా హిప్పోలు ఇండియాకి రానున్నాయి. కొలంబియాకి చెందిన మాఫియా కింగ్ ఎస్కోబార్ మరణంతో ఆయన పెంచుకున్న హిప్పోలని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.1980వ సంవత్సరంలో ఎస్కోబార్ ఆఫ్రికా నుంచి కొన్ని హిప్పోలను తన దేశానికి తెచుకున్నాడు. కానీ 1993లో అతన్ని హతమార్చిన తర్వాత ఆ హిప్పోలు స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టాయి. ఆంటియోకియాలో ఉన్న చిత్తడి నేలల్లో ఫ్రీగా మూవ్ అయ్యాయి. అయితే ఇప్పుడు వాటి సంఖ్య 150 దాటింది. ఇక వాటిని కొలంబియా పెంచుకోలేకపోతున్నది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం ఓ ఐడియాకు వచ్చింది. దాదాపు 70 హిప్పోలను విదేశాలకు తరలించాలని చూస్తుంది. హిప్పోల్లో సుమారు 10 జంతువులను మెక్సికోలో ఉన్న ఓస్టాక్ వన్యప్రాణి కేంద్రానికి తరలించనున్నారు. అయితే మరో 60 హిప్పోలను మాత్రం ఇండియాకు పంపాలన్న ఆలోచనలో కొలంబియా ఉన్నట్లు ఓ రిపోర్టు ద్వారా తెలిసింది. ఇండియాలో ప్రస్తుతం హిప్పో జాతికి చెందిన రైనోలు ఉన్నాయి. అస్సాంలో ఉన్న ఖాజీరంగా జాతీయ అటవీ క్షేత్రంలో రైనోలు ఉన్నాయి.అయితే హిప్పోలను వదిలించుకోవాలనుకుంటున్న కొలంబియాకు.. ఆ జంతువుల్ని తరలించేందుకు సుమారు 3.5 మిలియన్ల డాలర్లు ఖర్చు చేయనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement