Saturday, November 23, 2024

T20 World Cup: భారత్ పై పాక్ గెలుపు.. లెక్క ఎక్కడ తప్పింది?

T20 వరల్డ్ కప్ లో భాగంగా దాయాది పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘోరంగా ఓటమి పాలైంది. దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. రోహిత్‌ శర్మ డకౌట్‌తో మొదలైన పతనం చివరకు ఓటమి వరకు సాగింది. భారత్‌ను 10 వికెట్లతో చిత్తు చేసి వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (57) రిషభ్‌ పంత్‌ (39) మినహా మిగిలిన బ్యాట్స్​మన్ అందరూ చేతులెత్తేశారు. ఇక పాకిస్తాన్ పాక్‌ 17.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 152 పరుగులు చేసి గెలిచింది. టీ20 మ్యాచ్​లో భారత్​ 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి కాగా.. పొట్టి ఫార్మాట్​లో 10 వికెట్ల తేడాతో నెగ్గడం కూడా పాక్​కు ఇదే తొలిసారి.

పొట్టి ప్రపంచకప్‌లో 5-0తో భారత్‌ తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతుంది. భారతజట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ అన్ని విభాగాల్లో కోహ్లీసేన ఫైయిల్ అయింది. ఇంతవరకు T20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఒక్కసారి కూడా టీమిండియాను ఓడించలేకపోయింది. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లలో భారత్, పాకిస్థాన్ జట్లు ఐదుసార్లు తలపడగా.. ఈ ఐదు సార్లు కూడా భారతే గెలిచింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ ఈసారి కచ్చితంగా టీమిండియాపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అనుకున్నట్లు రికార్డు బ్రేక్ చేసిన పాకిస్తాన్..భారత్ పై గెలిచి పరువు నిలుపుకుంది.

ఇది కూడా చదవండి: TS: ఆర్టీసీ బస్సుల్లో క్యాష్‌ లెస్‌ జర్నీ.. డిజిటల్‌ పేమెంట్స్‌ దిశగా యత్నాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement