దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజులుగా వరుసగా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కేవలం 795 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 58 మంది మృతి చెందారు. అదే సమంయలో 1,280 మంది బాధితులు కోవిడ్ కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 12,054 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,29,839కు చేరింది. ఇందులో 4,24,96,369 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 5,21,416 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 98.67శాతం ఉండగా.. రోజువారీ పాజిటిటీ రేటు 0.17శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,84,87,33,081 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.