భారత్ లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. రోజు వారి కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. నిన్న 3545 కేసులు నమోదవగా.. ఇప్పుడు ఆ సంక్య నాలుగు వేలకు చేరువైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటన్ ప్రకారం.. దేశంలో కొత్తగా 3805 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 4,30,98,743కు చేరాయి. ఇందులో 4,25,54,416 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.
గడిచిన 24 గంటల్లో 3168 మంది కోలుకున్నారు. అయితే, మరో 22 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 5,24,024కి పెరిగింది. ఇక, ప్రస్తుతం దేశంలో 20,303 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటివరకు 1,90,00,94,982 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.