దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,483 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పొల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. తాజా కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,30,84,91కి చేరింది. దేశంలో గత 24 గంటల్లో 30 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5,22,223కు చేరుకుంది.
కరోనా నుంచి 1,970 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 15,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 187.95 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశారు.