తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో కిస్మస్ వేడుకల్ని నిర్వహించింది. ఈ వేడుకకి సీఎం కేసీఆర్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ప్రపంచంలో అత్యంత రంగుల దేశం ఇండియా ఒక్కటేనని ఆయన తెలిపారు. ఈ వేడుకలో కేసీఆర్ మాట్లాడుతూ .. ప్రపంచంలోని ఇస్లాం దేశాల్లో రెండు పండుగలు మాత్రమే ఉంటాయన్నారు. క్రిస్టియన్ దేశాల్లో కూడా రెండు పండుగలు మాత్రమే ఉన్నాయని అన్నారు. నెల వ్యవధిలో ఎన్నో పండుగలు చేసుకునే దేశం భారతదేశమని తెలిపారు. క్రిస్మస్, రంజాన్ , దసరా, దీపావళి, సంక్రాంతితో పాటు ఇలా పలు పండుగలు జరుగుతాయని వివరించారు.
రాష్ట్రంలోని ప్రజలంతా ఒక్కటేనని కేసీఆర్ తెలిపారు.. తెలంగాణలో పండుగలను సెలబ్రేట్ చేయాలని ఎవరూ చెప్పలేదని.. దరఖాస్తు పెట్టలేదన్నారు. ఎన్నో పోరాటాలు.. అనేక క్షోభలు ఎదుర్కొన్న తర్వాత తెలంగాణలో అందరూ బాగుండాలని ఒక పాలసీని తాము తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరి బాధ్యతను తీసుకుంటుందన్నారు. తెలంగాణలో ఎవరిపైనా ఎవరూ దాడి చేయరని.. అందరిని కాపాడే బాధ్యత తెలంగాణ సర్కారుదేనని చెప్పారు. పండుగ వేళ ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ.. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్ని.. డెవలప్ మెంట్ గురించి అదే పనిగా కేసీఆర్ వివరించటం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..