Tuesday, November 19, 2024

ప్రపంచ జనాభాలో భారతే నెంబర్ వన్..

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. చైనాను అధిగమించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. జనాభా విషయంలో చైనా ను భారతదేశం అధిగమించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ తాజా డేటా స్పష్టం చేసింది. చైనా కంటే ఇండియాలో 29లక్షల మంది జనాభా ఎక్కువగా ఉన్నారని తెలిపింది. చైనాను భారత్ ఎప్పుడు దాటిందో స్పష్టంగా వెల్లడించకపోయినా.. ప్రస్తుతం ఇండియాలోనే జనాభా ఎక్కువగా ఉందని ఆ డేటా ప్రకటించింది.

ప్రస్తుతం ఇండియాలో 142.86 కోట్ల జనాభా ఉంది. చైనా జనాభా 142.57 కోట్లుగా ఉందని ఆ డేటా వెల్లడించింది. జనాభా విషయంలో చైనాను ఇండియా దాటిపోయిందని ఈ డేటా అధికారికంగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా జనాభా 800కోట్లకు సమీపించిందని పేర్కొంది. చైనా కంటే భారత జనాభా 2.9 మిలియన్లు ఎక్కువగా ఉందని పేర్కొంది. చైనా జానాభాను భారత్ దాటడం 1950 తర్వాత ఇదే తొలిసారి. 1950 నుంచే ఐక్యరాజ్య సమితి పాపులేషన్ డేటాను వెల్లడిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement