Friday, November 22, 2024

Health: వీళ్లకేదీ యాదికుండదు.. పార్కిన్సన్‌ హాట్‌స్పాట్‌గా మారుతున్న భారత్‌

పార్కిన్సన్‌ వ్యాధికి కేంద్ర బిందువుగా దేశం మారుతోందని నిజామ్స్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ (నిమ్స్‌) న్యూరాలజీ విభాగం వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 5,80,000 మంది పార్కిన్సన్‌ వ్యాధిగ్రస్తులున్నారని వివరించింది. రానున్న 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మ‌ధ్య ఓ హోటల్‌లో పార్కిన్సన్‌ వ్యాధిపై సిపోజియం జరిగింది.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: లండన్‌ కింగ్స్‌ కాలేజీ వూఐద్యుడు డాక్ట‌ర్‌ వినోద్‌మెట్టా, నిమ్స్‌ న్యూరాలజీ హెచ్‌వోడీ రూపమ్‌ బొర్గోహెయిన్‌, సెలెరా న్యూరో హెడ్‌ నారాయణన్‌ మాట్లాడుతూ.. నిమ్స్‌ ఆసుపత్రిలో హాస్పిటల్లో డిమైన్‌ పంపులు, పెన్నుల (సిరంజ్‌) టైప్‌ చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ‘అపోమోర్ఫిన్‌ థెరపీ ఆఫ్‌ పీరియడ్ల్సో మందులు తీసుకునే సమయంలో ఉపశమనం ఇస్తుందని, కొద్ది రోజుల తర్వాత అవి సరిగా పని చేయడం లేదన్నారు. ఫలితంగా, రోగుల్లో వణుకు, పటుత్వం కోల్పోవడం, ఆందోళన చెందడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. ఐరోపాలో విస్తృతంగా ఉపయోగించే ప్రపంచస్థ్ఖాయి అపోమోర్ఫిన్‌ థెరపీని ఆంధ్రప్రదేశ్‌లోని రోగులకు డిమ్ఖైన్‌ పంపులు, సిరంజ్ల ద్వారా అందించే చికిత్సా విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.

జర్మన్‌ ఫార్మా మేజర్‌ ఎవర్‌ ఫార్మా తయారు చేసిన అధునాతన డిమ్ఖైన్‌ అపోమోర్ఫిన్‌ పంపులు మరియు పెన్నులు (ఇంజెక్షన్లు) సెలెరా న్యూరో చికిత్సా విధానం తెలుగు రాష్ట్రాల్లోని పార్కిన్సన్స్‌ డిసీజ్‌ రోగులకు ఒక వరంలా మారిందన్నారు. పార్కిన్సన్స్‌ రోగులకు ఆధునిక యూరోపియన్‌ అపోమోర్ఫిన్‌ పరికరాలు అందుబాటులో ఉండటం భారతదేశంలో ఇదే మొదటిసారని, అందులోనూ నిమ్స్‌ లో అందుబాటులోకి తీసుకురావటం చాలా సంతోషంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement