పాకిస్థాన్ డే సందర్భంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు లేఖ రాశారు. పాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ తో స్నేహపూర్వక సంబంధాలను తాము కోరుకుంటున్నామని, ఇదే సమయంలో ఆ సంబంధాలు నమ్మకమనే పునాదులపై నిలబడి వుండాలని మోదీ అన్నారు. తొలుత పాకిస్థాన్ ఉగ్రవాదానికి దూరం కావాల్సి వుందని మోదీ కోరారు. ‘పాకిస్థాన్ డే’ సందర్భంగా ఆ దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖను పంపారు.
కాగా, ఈ లేఖ ప్రతి సంవత్సరమూ పంపించే రొటీన్ లెటర్ మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొద్ది రోజుల క్రితమే కరోనా బారిన పడిన ఇమ్రాన్ ఖాన్.. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇమ్రాన్ కు మోదీ లేఖ
Advertisement
తాజా వార్తలు
Advertisement