భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగాయి. దేశంలో తాజాగా మూడు లక్షలకు పైగా రోజువారి కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,13,603 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో తాజాగా 491 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,84,246కి చేరింది.
24 గంగల్లో 2,23,990 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 19,24,051 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,82,18,773కి చేరింది. ఇందులో 3,58,07,029 మంది పూర్తిగా కోలుకున్నారు. భారత్‌లో బుధవారం ఒక్కరోజే 73,38,592 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,59,67,55,879కు చేరిందని కేంద్రం తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..