దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రతి రోజూ 30 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. అయితే, థర్డ్ వేవ్ ముప్పుపొంచి ఉందన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. వ్యాక్సిన్‌ను వేగం చేయడంతో కరోనా కేసులు నమోదవుతున్నా మరణాల సంఖ్య, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. థర్డ్ వేవ్ ముప్పుపై బెనారస్ విశ్వవిద్యాలయం పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో కొన్ని విషయాలు వెలుగుచూశాయి. మూడో వేవ్ ముప్పు మరో మూడు నెలల తరువాత వచ్చే అవకాశం ఉందని, మూడో వేవ్ వచ్చినప్పటికీ అంత ప్రమాదకరంగా ఉండకపోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తుండటంతో మూడో వేవ్ ప్రభావం తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: అతనితో ఐదేళ్లు డేటింగ్ చేశా: నర్గిస్ ఫఖ్రీ