Monday, November 25, 2024

జ‌న‌వ‌రి-ఏప్రిల్ లో కరోనా థర్డ్ వేవ్..?

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి.  ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు తెరుచుకుంటున్నాయి.  ప‌ర్యాట‌క రంగం తెరుచుకోవ‌డంతో టూరిస్టులు భారీ సంఖ్య‌లో ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తున్నారు.  దీంతో ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ర‌ద్దీ పెరుగుతున్న‌ది. ప‌ర్యాటక ప్రాంతాల్లో ర‌ద్దీ పెర‌గ‌డం వ‌ల‌న క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగే అవ‌కాశం ఉంద‌ని, జ‌న‌వ‌రి-ఏప్రిల్ మ‌ధ్య‌కాలంలో కేసులు తీవ్ర‌స్థాయికి చేర‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.  సామాజిక‌, రాజ‌కీయ‌, మత‌ప‌ర‌మైన కార‌ణాల‌తో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున గుమిగూడితే దాని వ‌ల‌న కేసులు పెరుగుతాయ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.  ప‌ర్యాట‌క రంగం తిరిగి తెరుచుకున్నాయ మ‌నాలి, డార్జ‌లింగ్ వంటి ప్రాంతాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని, ఇదే విధ‌మైన పెరుగుద‌ల‌లు మిగ‌తా ప్రాంతాల్లో కూడా ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.  ఆంక్ష‌ల‌ను స‌డ‌లించినా గుమిగూడ‌టంపై నియంత్ర‌ణ ఉంటే కేసులు పెర‌గ‌క‌పోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.  

ఇది కూడా చదవండి: నేడు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిర‌స‌న‌లు..

Advertisement

తాజా వార్తలు

Advertisement