దేశంలో రోజువారి కరోనా కేసులు ఎక్కడా తగ్గడం లేదు. ప్రతిరోజు నిలకడగా 45 వేలకు పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. నిన్న 36,571 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,23,58,829కు చేరింది. అలాగే నిన్న కరోనా నుంచి 36,555 మంది కోలుకున్నారు. నిన్న 540 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,33,589కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,15,61,635 మంది కోలుకున్నారు. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 150 రోజుల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. 3,63,605 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 54,71,282 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్పటివరకు మొత్తం 57,22,81,488 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్రకటించారు. ఇక, నిన్న దేశంలో మొత్తం 18,86,271 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు మొత్తం 50,26,99,702 కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: రైతులతో చర్చలకు సిద్ధం : రాజ్‌నాధ్ సింగ్