భారత పర్యటనకు విచ్చేసిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో భేటీ అయ్యారు. అంతకుముందు సౌత్ బ్లాక్ లోని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నివాసానికి వెళ్లి కూడా చర్చలు జరిపారు. 2020 గల్వాన్ లోయ ఘర్షణ అనంతరం ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం ఇంత వరకు జరగలేదు. నాటి ఘటనలో భారత్ 20 మంది జవానుల ప్రాణాలను నష్టపోగా.. చైనాకు రెట్టింపు నష్టం జరిగింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించనంత వరకు, సరిహద్దు ఒప్పందాలను గౌరవించి, కట్టుబడి ఉండనంత వరకు పూర్వం మాదిరి సంబంధాలు సాధ్యపడవని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ సమయంలో వాంగ్ యీ భారత్ కు రావడం పట్ల ప్రాధాన్యం నెలకొంది.
దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన తూర్పు లడఖ్‌లో సైనిక ప్రతిష్టంభన తర్వాత సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురైన తర్వాత చైనా విదేశాంగ మంత్రి గురువారం సాయంత్రం రెండు దేశాల మధ్య అత్యున్నత స్థాయి పర్యటనలో ఢిల్లీకి చేరుకున్నారు.