Saturday, November 23, 2024

ఇండియాలో భారీ స్క్రీన్ మూసివేత – ఎందుకంటే

ఇండియాలో భారీ స్క్రీన్ పై ఏపీలో టిక్కెట్స్ రేట్ల ఇష్యూ ప్ర‌భావం ప‌డింది. ప్ర‌పంచంలో మూడో భారీ స్ర్కీన్ గా పేరొందింది వి ఎపిక్ సినిమా థియేట‌ర్. వంద అడుగుల వెడ‌ల్పు, యాభైనాలుగు అడుగుల ఎత్తు, 650మంది సీటింగ్ కెపాసిటీ వి ఎపిక్ సొంతం. వి ఎపిక్ కి ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. సౌత్ ఆసియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఉంది. రూ. 40 కోట్లతో దీనిని నిర్మించారట‌. నెల్లూరు జిల్లావాసులు మాత్రమే కాదు, చెన్నైకి దగ్గరలో ఉండటంతో అటు ఇటు ప్రయాణాలు చేసే ప్రజలు సైతం ఆ థియేటర్లో సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. సాహో సినిమాతో ఈ థియేటర్‌లో షోలు మొదలయ్యాయి. దీనికి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ ప్రారంభించారు.

ఏపీలో టికెట్ రేట్స్ ప్రభావంతో ఆ థియేటర్ మూతపడింది..ఇండియాలో, సౌత్ ఆసియాలో భారీ స్క్రీన్ అయినప్పటికీ… కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి థియేటర్ నిర్మించినప్పటికీ… గ్రామ పంచాయతీలో థియేటర్ ఉంది. దాంతో ఏపీ ప్రభుత్వం చెప్పిన రేట్లకు టికెట్లు అమ్మాల్సిన పరిస్థితి. గ్రామ పంచాయతీ పరిధిలో రూ 5, 10, 15 రూపాయల రేట్లను ప్రభుత్వం ఫిక్స్ చేశారు. ఆ రేట్లకు టికెట్లు అమ్మడం కంటే థియేటర్ మూసి వేయడం వల్ల వచ్చే నష్టాలు తక్కువ అని యాజమాన్యం భావించింది. దాంతో తెరపై సినిమాలు ప్రదర్శించడం మానేసి, మూసేసింది. మ‌రి ఎప్ప‌టికి తెరుచుకుంటుంద‌నే విష‌యం తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement