Tuesday, November 26, 2024

Spl Story | ఐసీసీ ర్యాంకింగ్స్​లో టీమిండియా టాప్-1.. కివీస్​పై 3.0 ఘన విజయంతో మరింత మెరుగు

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్​ ప్లేస్​కి చేరుకుంది. రోహిత్ శర్మ జట్టు ఇప్పుడు రెండు వైట్-బాల్ ఫార్మాట్‌ చార్ట్ లలో అగ్రస్థానంలో ఉంది. ఇదే ఊపుతో భారత జట్టు ఉపఖండంలో అక్టోబర్, నవంబర్ జరిగే వన్డే వరల్డ్​ కప్​కి వెళ్లనుంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

టీమిండియా ODI ర్యాంక్స్​లో ఇప్పటిదాకా మూడవ స్థానంలో ఉంది. అయితే రేటింగ్ పాయింట్లలో మొదటి రెండు జట్లు – ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లతో సమంగా ఉంది. అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడటంతో భారత్ ప్రపంచ నెంబర్​ వన్​ ర్యాంక్‌లో నిలిచింది. న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లలో క్లీన్ స్వీప్ చేయడంతో భారత జట్టు తమను తాము ప్రపంచంలోనే అత్యుత్తమ వైట్-బాల్ జట్టుగా నిరూపించుకుంటోంది.

కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమ్ గిల్ సెంచరీల చెలరేగి ఆడడంతో సిరీస్‌లోని చివరి వన్డేలో భారత్ 385 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ODIలలో కరువుతో ఉన్న రోహత్​ శర్మ తన సెంచరీతో అధిగమించాడు. జనవరి 2020 నుండి ఇప్పటి వరకు సెంచరీ చేయలేదు. ఇవ్వాల తన మొదటి సెంచరీని సాధించాడు.

వైట్ బాల్ ఫార్మాట్‌లో ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానంలో ఉండగా, టెస్టుల్లో ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో ఉంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు కోసం భారత్ 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement