Tuesday, November 26, 2024

China: చైనాకు చెందిన‌ మ‌రో 54 యాప్‌ల‌పై భార‌త్ నిషేధం..!

తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. జూన్ 2020లో చైనా యాప్ లపై మొదటి రౌండ్ నిషేధాన్ని ప్రకటించింది. దేశ సార్వభౌమాధికారం, భద్రతకు ముప్పు ఉందని పేర్కొంటూ టిక్‌టాక్, వీచాట్ షేర్‌ఇట్‌, హలో, లైకీ, యూసీ బ్రౌజర్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన విష‌యం తెలిసిందే.

అయితే తాజా భార‌త్ చైనాకు మ‌రోసారి షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన 54 యాప్‌ల‌ను నిషేధించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. చైనా పాపుల‌ర్ యాప్‌లు స్వీట్ సెల్ఫీ హెడ్‌, బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిట‌ర్‌, టెన్‌సెంట్ జీవ‌ర్‌, ఒన్‌మోజీ ఎరినా, యాప్ లాక్ వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించేలా ఆ యాప్‌లు ఉండ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ 54 యాప్‌లు చాలా ముఖ్య‌మైన డేటా అనుమ‌తులు అడుగుతూ సున్నిత‌మైన స‌మాచారాన్ని సేక‌రిస్తున్నాయ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.

ఆ యాప్‌లు రియ‌ల్ టైమ్ డేటాను తీసుకుంటున్నాయని ఆ స‌మాచారాన్ని దుర్వినియోగం చేసే అవ‌కాశముంద‌ని తెలిపాయి. గ‌తంలో నిషేధించిన వాటిలో వీటిల్లో టిక్ టాక్ తో పాటు విచాట్, షేరొట్, హలో, లైకీ, యూసీ బ్రౌజర్, పబీ వంటి యాప్లున్నాయి. హలో, లైకీ, యూసీ బ్రౌజర్, పబీ వంటి యాప్లున్నాయి. చైనాకు చెందిన వేలాది యాప్‌లలో అతి ముఖ్య‌మైన యాప్‌ల‌ను భార‌త్ నిషేధిస్తోంది. వాటి ద్వారా దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉండ‌డంతో 2020 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 300 యాప్‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నిషేధించిన విష‌యం విదిత‌మే.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement