గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వాడిన యాంటీబాడీ కరోనా ఔషధం గురించి ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఎన్నికల టైమ్‌లో ఆయన కరోనా బారిన పడితే.. ఈ యాంటీ బాడీ కాక్‌టెయిల్ వేసుకుని వారంలోపే కోలుకుని ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ మందే మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు దీనికి మన దేశంలో అనుమతి లభించింది.
స్విట్జర్లాండ్‌కు చెందిన ఫార్మా కంపెనీ రోచే (ROCHE) తయారు చేసిన ఈ మందుకు భారత్‌లోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పర్మిషన్ ఇచ్చింది. ఈ మందులోని యాంటీబాడీలు కరోనాపై సమర్థవంతంగా పోరాడుతాయని, ఇది టీకాలలాగే పనిచేస్తుందని రోచే కంపెనీ తెలిపింది. దీని మార్కెటింగ్‌ను ఇండియాలో సిప్లా కంపెనీ చూసుకుంటోందట. దీన్ని కరోనా వచ్చిన తక్కువ లక్షణాల నుంచి ఓ మోస్తరు లక్షణాలున్నవారిలో ప్రయోగిస్తారు. ఇది సార్స్ కోవ్-2లోని స్పైక్ ప్రోటీన్‌పై బాగా పనిచేస్తుంది. దీంతో వైరస్ మన శరీరంలోని ఏసీఈ2 కణాలకు అతుక్కోలేదు. కాబట్టి వైరస్‌ను త్వరగా నిరోధిస్తుంది. దీన్ని 12ఏళ్లు దాటిన వారు కూడా 600ఎంజీ చొప్పున వాడొచ్చు. ఈ మందు వేసుకుంటే ఆస్పత్రిలో చేరాల్సిన ప్రమాదాన్ని 70 శాతం వరకు తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్‌పై పోరాడేలా చేస్తుంది. దాంతో మనం ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.