Tuesday, November 26, 2024

Big Story: ఈనెల 20 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా సిరీస్‌ షురూ.. అక్టోబర్​లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌!

అక్టోబర్‌లో జరగనున్న టీ 20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ – ఆస్ట్రేలియా జట్లు టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలో దిగుబోతున్నాయి.
అయితే దీని కంటే ముందే ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ సెప్టెంబర్‌ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఆడే ఆటగాళ్లే వరల్డ్‌ కప్‌ తుది జట్లలో ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీరికి ఈ మూడు మ్యాచ్‌ల అనుభవం కీలకం కానుంది. అయితే ఈ రెండు జట్ల నుంచి ఎవ రిపై ఎక్కువ ఆశలు ఉన్నాయో.. ఎవరు ఆయా జట్లకు కీలకం కానున్నారో చూద్దామా..

సూర్యకుమార్‌ యాదవ్‌:
భారత జట్టులో సూర్యకుమార్‌ యాదవ్‌పై కూడా భారీ ఆశలే ఉన్నాయి. అతడు జట్టులోకి అడుగుపెట్టిన నుంచి మంచి ప్రదర్శనే చేస్తున్నాడు. వేగంగా పరుగులు రాబడుతూ జట్టు భారీ స్కోరు సాధించేందుకు కృషి చేస్తున్నాడు. మైదానంలో అన్ని వైపులా షాట్లు ఆడగలగడం అతడి బలం. ప్ర స్తుతం టీ 20 ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. వరల్డ్‌లోనూ సూర్య మెరుగైన ప్రదర్శన చేస్తే.. భారత్‌ టైటిల్‌ లిప్ట్‌ చేయడం ఖాయం.

కెఎల్‌ రాహుల్‌:
వరల్డ్‌ కప్‌లో మరో ఆటగాడు కెఎల్‌ రాహుల్‌ పై భారీ ఆశలే ఉన్నాయి. అయితే ఆసియాకప్‌లో మొదట్లో అతడి ఆటపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓపెనర్‌గా జట్టుకు మ్యాచ్‌ల్లో ఓపెనింగ్స్‌ అందించాలి. రాహుల్‌ రాణిస్తే తర్వాత వచ్చే సూర్యకుమార్‌ యాదవ్‌, పాండ్యా తర్వాత జట్టుకు పరుగులు జోడించేందుకు అవకాశం ఉంటుంది. ఆసయాకప్‌ చివరి మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి శతకం బాదిన కోహ్లి.. ఓపెనర్‌గా రోహిత్‌తో తనకు మంచి భాగస్వామ్యం ఉందని ఇటీవల చెప్పాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓపెనర్‌గా వస్తున్న రాహుల్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవల్సిన అవసరం ఉంది.

విరాట్ కోహ్లీ:
వరల్డ్‌ కప్‌లో అందరి దృష్టి విరాట్‌ కోహ్లీపైనే ఉండనుంది. ఇటీవలె ఈ ఆటగాడు ఆసియాకప్‌లో మంచి ప్రదర్శన చేశాడు. ఎంతో కాలంగా వేచి చూస్తున్న తన 71వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టోర్నమెంట్‌ మొత్తానికి అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లలో రెండో స్థానంలో (276) నిలిచాడు. మొదటి స్థానంలో పాకిస్తాన్‌ ఆటగాడు మహమ్మద్‌ రిజ్వాన్‌ ఉన్నాడు. అయితే ఆసియాకప్‌ కంటే ముందు కోహ్లి చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. కోహ్లి ఫామ్‌పై చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కోహ్లి మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు. అయితే భారత్‌ వరల్డ్‌కప్‌ గెలవాలంటే కోహ్లీ తన అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే అందరి దృష్టి అతడిపైనే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement