ఆసియా క్రీడల్లో భారత్ దూసుకుపోతోంది. మరో స్వర్ణంతో మన క్రీడాకారులు సత్తా చాటారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలో సరబ్‌జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమాతో కూడిన జట్టు బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నది. టీమ్ ఈవెంట్‌లో భారత త్రయం 1734.50 పాయింట్లతో అగ్రస్థానంలో నిలచింది. 1733.62 పాయింట్లు సాధించిన చైనా జట్టు రజతంతో సరిపెట్టుకున్నది.
కాగా, ఇదే విభాగంలో సరబ్‌జ్యోత్ సింగ్, అర్జున్ సింగ్ టాప్ 8కు అర్హత సాధించారు. సరబ్‌జ్యోత్ 5వ ప్లేస్‌లో ఉండగా, అర్జున్ 8వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు వుషు స్టార్ ప్లేయర్ రొషిబినా దేవి మహిళల 60 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలుపొందింది. దీంతో ఏషియన్ గేమ్స్ పతకాల పట్టికలో మొత్తం 24 మెడల్స్‌తో భారత్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. ఇందులో ఆరు బంగారు పతకాలు ఉండగా, 8 సిల్వర్, 10కాంస్య పతకాలున్నాయి.